గుంతకల్లు: గుత్తి మండలం శ్రీపురం గ్రామ శివారులో ఆటో ను వెనుక నుంచి ఢీ కొన్న ఆటో, పది మందికి గాయాలు
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని శ్రీపురం గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై నాగసముద్రం క్రాస్ వద్ద ఆటోను వెనుక నుంచి మరో అటో ఢీకొట్టి పది మందికి గాయాలయ్యాయి. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన వరలక్ష్మి, లలిత, మల్లీశ్వరి, కౌశిక్, గుత్తి పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన లక్ష్మీదేవి, గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన రమాదేవి, గుత్తి మండలం అనగానదొడ్డికి చెందిన నాగవేణి, కీర్తన ప్రియ, రాము, సాలమ్మలు సోమవారం పని నిమిత్తం గుత్తికి వచ్చారు. అనంతరం స్వగ్రామాలకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.