కర్నూలు: విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తాం:మంత్రి టిజీ భరత్
విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం పెద్దపాడులోని ఓ ఫంక్షన్ హాలులో ఇటీవల 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అవార్డులతో పాటు రూ.20 వేల చెక్కులను జేసీ నవ్య, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ప్రదానం చేశారు. పట్టుదలతో చదువుకొని మంచి మార్కులు సాధించడం అభినందనీయమని మంత్రి అన్నారు.