సంగారెడ్డి: ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపుపై ఇండియా కూటమి నిరసన
సంగారెడ్డిలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపిస్తూ, అర్హులైన ఓట్లను పునరుద్ధరించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ చిరంజీవి డిమాండ్ చేశారు.