లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆదివారం ఉట్నూర్ పట్టణంలో నిర్వహించే ధర్మ యుద్ధం మహాసభకు తరలిరావాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కోరారు. శనివారం ASF జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు..ఆదివాసీల రిజర్వేషన్ ను కొల్లగొట్టి ఉపాధి, ఉద్యోగాలను లంబాడాలు, సుగాలిలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు స్పందించి లంబాడాలు, సుగాలీల ఎస్టీ హోదాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.