శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు
బుధవారం రాత్రి పోతుగుంట రమేష్ నాయుడు శ్రీశైలం దేవస్థానం వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజువారీ ఓపీ రోగుల వివరాలు, వైద్య పరీక్షలు, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, రోగులకు పంపిణీ చేస్తున్న మందులు, అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం వైద్యశాల సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, రోగుల సంఖ్యకు అనుగుణంగా అన్ని రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రాణాపాయ స్థితిలో వచ్చే వారికి ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణ వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైన రోగులను మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలనన్నారు.