జూలూరుపాడు: వచ్చే విజయదశమి నాటికి జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా జరుగుతున్న జూలూరుపాడు టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనులను వేగవంతం చేసి విజయదశమి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువల నిర్మాణానికి సహకరించాలని రైతులకు సూచించారు.