హిందూపురం గుడ్డం రంగనాథ స్వామి ఆలయం సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు మృతి
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని గుడ్డం రంగనాథ స్వామి ఆలయ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు మృతి చెంది ఉండడాన్ని గమనించి స్థానికులు హిందూపురం రైల్వే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు