అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గుండ్లపల్లి గ్రామంలో అద్దె గదిలో నివాసం ఉంటున్న వేంపల్లి నాగేశ్వర రాజు (53) ఇంట్లోనే బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామానికి చెందిన నాగేశ్వరరాజు గత 20 సంవత్సరాలుగా అద్దె గదిలో నివాసం ఉంటూ డిఎంసి కంకర మిషన్లు తార్ ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించే వారని స్థానికులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుకి మృత దేహాన్ని తరలించారు.