ఆంధ్ర ప్రదేశ్ రెండవ అధికార భాషగా ఉన్న ఉర్దూ భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని MRO కు SDPI వినతి
ఆంధ్ర ప్రదేశ్ రెండవ అధికార భాషగా ఉన్న ఉర్దూ భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) హిందూపురం నాయకులు హిందూపురం తహసిల్దార్ కార్యాలయంలో MRO వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు. తెలుగు మరియు ఆంగ్ల భాషలతో పాటు ఉర్దూ భాషను కూడా ప్రభుత్వ లోగోలు, బోర్డులు, పేరు ఫలకాలు మరియు పత్రవ్యవహారాల్లో తప్పనిసరిగా వినియోగించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా SDPI జిల్లా అధ్యక్షుడు కారి అమ్జాద్ అలీ మాట్లాడుతూఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2వ అధికార భాషగా గుర్తించినప్పటికీ,చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలులో లేకపోవడం విచారకరమన్నారు.