అష్టాదశ శక్తిపీఠం,ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం కి భక్తులు పోటెత్తారు,క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు,దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది,వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్,దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు, దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది, మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు అధికారులు,సామాన్య భక్తులకు ఉచిత,శీఘ్ర,అతిశీఘ్ర, దర్శనాలు చేసుకుంటున్నారు.