వందల కోట్ల విలువల చారిటబుల్ ట్రస్ట్ భూమిని ఆక్రమిస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు భూమిని దక్కించుకుని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతుండటాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు–వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. డీఎస్పీ వెంకటేశ్వర్లు రంగంలోకి దిగడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. వైసీపీ నేతలు పన్నులు బకాయిలో ఉన్నా నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారో ప్రశ్నించారు. దేవాదాయ శాఖ భూములను వాణిజ్య ప్రాజెక్టులకు కేటాయించడంలో కోట్ల రూపాయల ముడుపులు జరిగినట్లు ఆరోపిస్తూ, దాని వెనుక రాజకీయ శక్తిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.