ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
Ongole Urban, Prakasam | Aug 3, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పోలీస్ స్టేషన్లో చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సిల్ ఇచ్చారు. ఒంగోలు డివిజన్ పరిధిలో డిఎస్పి శ్రీనివాసరావు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు కౌన్సిల్ కి ఇవ్వడంతో పాటు హెచ్చరించినట్లు తెలిపారు. మీ చెడు ప్రవర్తన వల్ల మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని వారిని హెచ్చరించారు. ఇప్పటికే వీరిపై రౌడీషీట్ ఓపెన్ చేయడం జరిగి ఉంటుందని డిఎస్పి అన్నారు. ప్రవర్తన మార్చుకొని ప్రజలతో బాగా కలిసి మెలిసి ఉండాలని చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు డిఎస్పి సూచించారు.