ఏ కులం రాజకీయ పార్టీని శాసించలేదు: అమలాపురంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు
ఏ కులం కూడా రాజకీయ పార్టీని శాసించలేదని, అన్ని కులాలను కలుపుకుని సమష్టిగా సకల జనుల శ్రేయస్సు కోసం ముందుకు వెళ్లే రాజకీయ పార్టీలే మనుగడ సాగిస్తాయని జనసేన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు పేర్కొన్నారు. ఒక కులం వారికి సీటు ఇస్తే చెయ్యం, ఆ పార్టీ వారికి ఇవ్వకూడదని చెబితే వినేవారు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. పొత్తు ధర్మంలో సమిష్టిగా ముందుకు సాగాలని సూచించారు. అమలాపురం సీటు టీడీపీకి ఇస్తే తామంతా మనస్ఫూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.