సామర్లకోట మండలం, పి.వేమవరం గ్రామం రైతు భరోసా కేంద్రంవద్ద రైతుల ఆందోళన, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం అన్న, నాయకులు.
కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం పి వేమవరం గ్రామం, రైతు భరోసా కేంద్రం వద్ద, రైతులకు యూరియా అంధక ఆందోళన చేపట్టారు. ఒక పక్క రైతులకు యూరియా అంధక ఆందోళన చెందుతూ ఉంటే. మరో ప్రక్క అధికారులు పక్షపాత ధోరణి వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి రెవిల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి అంబల సతీష్ మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల్లో యూరియా సరఫరా లో పారదర్శకత లోపించిందని,, రాష్ట్ర ప్రభుత్వం తగినంత యూరియా ఉందని చెబుతున్న వాస్తవానికి రైతులు డిమాండ్ చేసే అంత యూరియా అందుబాటులో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.