అదిలాబాద్ అర్బన్: బీజేపీలో ఉన్న దళిత నేతలు రాజీనామా చేయాలి:పట్టణంలో దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కాంబ్లె ప్రజ్ఞషీల్
అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీలో ఉన్న దళిత నాయకులందరూ రాజీనామా చేసి బయటకు రావాలని దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కాంబ్లె ప్రజ్ఞషీల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గాయక్వడ్ ,మాత రమాబాయి మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు శోభ తుల్జాపురే, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.