అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో డీజల్ షెడ్ వెనకాల భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో బళ్ళారి వైపునకు వెళ్లే మార్గం పక్కన ఇంజన్ లైన్ లో 100/101 పాయింట్ వద్ద ఖాళీ ప్రదేశంలో భారీగా అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయటంతో అక్కడ ఉన్న చెత్తా చెదారం లో మంటలు వ్యాపించి భారీగా ఎగసి పడ్డాయి. ప్రమాదం జరిగి భారీగా మంటలు వ్యాపించి రైల్వే కు సంబంధించిన విలువైన వస్తువులు కాలిపోయాయి. గమనించిన రైల్వే ఉద్యోగులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.