ప్రత్తిపాడు: కాణిపాకం వినాయకుడికి అన్నవరం దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నవరం దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు, వైదిక పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక దర్శనం కల్పించి, స్వామివారి చిత్రపటాలను బహూకరించారు.