గుంటూరు: గుంటూరు నగర ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలి: గుంటూరు జిల్లా కలెక్టర్ ఆన్సారియా
Guntur, Guntur | Sep 22, 2025 గుంటూరు నగర ప్రజలు కాచి, చల్లార్చిన నీటిని తాగాలని, బయట ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. గుంటూరు నగరంలోని జిల్లా కలెక్టర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 3 కలరా కేసులు గుర్తించి వారికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. డయేరియా నియంత్రణ కోసం ప్రత్యేక బృందాల ద్వారా సర్వే చేయించి అన్నీ ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. నగర ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.