ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర రెడ్డిపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి : టీడీపీ నాయకులు
ఎమ్మిగనూరు MLAపై ఆరోపణలు తగవు: TDP..ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర రెడ్డిపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులు నరసప్ప, కలీముల్లా సూచించారు. వాళ్లు మాట్లాడుతూ.. 100పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే, ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసంపూర్తిగా ఉన్న ఆసుపత్రి నిర్మాణాన్ని ఎమ్మెల్యే పూర్తి చేసి సౌకర్యాలు సమకూరుస్తున్నారని చెప్పారు.