జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బంద్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బీసీ సంఘాల నాయకులతోపాటు బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఎం, టి ఆర్ పి పార్టీల నాయకులు బందులో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో ర్యాలీలు నిర్వహించి వ్యాపార సముదాయాలను మూయించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేశారు. బందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.