శ్రీకాకుళం: నరసన్నపేటలో పట్టుబడ్డ 820 కేజీల పీడీఎస్ బియ్యం: ఆటో డ్రైవర్ అరెస్ట్
నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 820 కేజీల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొందూరు నుంచి పర్లాకిమిడికి వెళ్తున్న ఆటోను తనిఖీ చేసిన అధికారులు, డ్రైవర్ దల్లి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.