శ్రీశైలం: మహానంది మండలం గోపవరం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఐటిఐ విద్యార్థి తిమ్మపోగు రాజు మృతి
నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ఐటీఐ విద్యార్థి తిమ్మపోగు రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని బావిలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బావి వద్దకు చేరుకొని రాజు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.