శ్రీశైలం: మహానంది మండలంలో యదేచ్ఛగా అక్రమంగా ఎర్రమట్టి రవాణా పట్టించుకోని అధికారులు
మహానంది మండలంలో యదేచ్చగా ఎర్రమట్టి అక్రమ రవాణా జరుగుతుంది. భారీ వాహనాల్లో బండి ఆత్మకూరు మండలం మహానంది మండలం సరిహద్దుల నుంచి ఎర్రమట్టి తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. భారీ టిప్పర్లలో ఎర్రమట్టి, తెలుగుగంగ కట్టమీద నుంచి వెళుతున్నారు.దీంతో కట్టా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా దారులపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.