ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గాజులదిన్నె: నిండుకుండాలా జీడీపీ.. 4. 2 టీఎంసీల నీటి నిల్వ,. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 4.5 టీఎంసీలు
ఎమ్మిగనూరు: గాజులదిన్నె: నిండుకుండాలా జీడీపీ.. 4. 2 టీఎంసీల నీటి నిల్వ..గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) నుంచి హంద్రీనదికి గురువారం నీటి విడుదలను నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా వచ్చిన వరదనీటితో గత మూడు రోజులుగా నీటిని విడుదల చేసిన అధికారులు, ప్రవాహం తగ్గడంతో క్రస్ట్ గేటును మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది.