కర్నూలు: ఒలింపిక్ పరుగును విజయవంతం చేయండి: మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ శమంతకమణి
కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే ఒలింపిక్ డే రన్ను విజయవంతం చేయాలని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ శమంతకమణి పిలుపునిచ్చారు. బుధవారం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఒలింపిక్ డే రన్ ఉత్సవాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాఘవేంద్ర, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.