శ్రీశైలం: ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామంలో నవోదయం 2.0 కార్యక్రమం పై నాటుసార తయారీదారులకు అవగాహన కల్పించిన ఎక్సైజ్ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘నవోదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామంలో శనివారం నాటుసారా తయారీ, అమ్మకాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాలు, జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సాదు రవికుమార్ సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు నాటుసారా వల్ల కలిగే అనర్థాలను వివరించారు. నాటుసారా వృత్తిని మానుకునే కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందించి కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారం, గొర్రెలు, బర్రెల పెంపకం వంటి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.