నల్గొండ: దళిత బంధు రెండో విడత నిధుల విడుదల కోసం డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి కోరుతోంది. సుమారు 17,500 మంది లబ్ధిదారులకు న్యాయం చేయాలని జిల్లా అధ్యక్షులు కందుల లక్ష్మయ్య, నియోజకవర్గ ఇన్చార్జి బడుపుల శంకర్ డిమాండ్ చేశారు.