శ్రీశైలం: శ్రీశైలం ఆలయంలో మరోసారి బయటపడిన భద్రత వైఫల్యం. మల్లన్న ఆలయ పరిసరాల్లో రిల్స్ చేసి పోస్ట్ చేసిన యువతి
శ్రీశైల దేవస్థానంలో గర్భగుడిలో వీడియో చిత్రీకరణ ఘటన మరువక ముందే శ్రీశైల ఆలయంలో యధేచ్చగా వీడియో చిత్రీకరించి,సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో అప్లోడ్ చేసిన ఘటన చోటుచేసుకుంది దేవస్థాన భద్రత కోసం ప్రత్యేకంగా అధికారి,సిబ్బంది ఉన్నప్పటికీ, సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్న వీఐపీల పేరుతో కొంతమంది మొబైల్స్ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు అంతేకాకుండా మల్లికార్జున స్వామి ఆలయంలో యధేచ్చగా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ యువతి తన ఇన్ఫ్రాగాంలో ఆలయంలో చేసిన వీడియోను గత రెండు రోజుల క్రితం అప్లోడ్ చేసింది దీంతో మల్లన్న ఆలయం భద్రత గాలిలో దీపంలా మారింది.