భీమిలి: భీమిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సరగడ అప్పారావు నియామకం
భీమునిపట్నం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చిప్పాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సరగడ అప్పారావును స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు నియమించారు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కార్యకర్తల అభిప్రాయములును ఐ వి ఆర్ ఎస్ సర్వే ద్వారా సేకరించి భీమిలి రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సరగడ అప్పారావును ఎంపిక చేయడం జరిగింది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సరగడ అప్పారావును మరియు మండల పార్టీ కమిటీ సభ్యులను కూడా భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సాలువ తో సత్కరించి అభినందించారు.