పామూరు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మందుబాబులను హెచ్చరించిన పామూరు ఎస్సై అనూక్
Pamur, Prakasam | May 6, 2026
పామూరు మండలంలో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పామూరు ఎస్సై అనూక్ హెచ్చరించారు. బుధవారం పామూరు మండలంలోని పలు ప్రదేశాల్లో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై అనూక్ విస్తృతంగా తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి చేత ఖాళీ మద్యం బాటిల్లను ఏరి వేయించి, ఆ ప్రదేశాలను శుభ్రం చేయించారు. బహిరంగ ప్రదేశాలు, ఆలయాలు, పాఠశాలలకు సమీపంలో బహిరంగంగా మద్యం సేవించి అనుచితంగా ప్రవర్తించే మందుబాబులపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.