హిందూపురంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారికి ఎలక్ట్రికల్ మోటార్స్ వీల్ చైర్ వితరణ
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు అందించడంలో భాగంగా హిందూపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ (అశ్విన్ )చిన్నారికి హిందూపురం మున్సిపల్ చైర్మన్ డి. ఈ రమేష్ కుమార్, ఎంఈఓ గంగప్ప,భవిత కేంద్రం పర్మినెంట్ డోనర్ బైసాని రాంప్రసాద్ హాజరు అయ్యి 50 వేల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్ మోటార్ వీల్ చైర్ ఆ చిన్నారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాబాయి దేశ్ముఖ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ,భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు లలిత, నందిని చిన్నారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.