హనుమకొండ: హనుమకొండ బాలసముద్రంలో ప్రమాదకరంగా హైటెన్షన్ విద్యుత్తు తీగలు
హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని ప్రభుత్వ ఈతకొలను వద్ద హైటెన్షన్ తీగలు చెట్ల మధ్య నుంచి వెళ్తుండటంతో ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ షాక్ కొట్టే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తీగలను సరిచేయాలని కోరుతున్నారు.