తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో జరుగుతున్న స్వమిత్వా సర్వే ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని పూడేరూ సచివాలయంలో జరిగిన స్వమిత్వా గ్రామసభలో పాల్గొన్న ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి మాట్లాడుతూ గ్రామ కంటాలలో ఇల్లు నిర్మించుకున్న వారికి రెవెన్యూ అధికారులు స్వమిత్వా కార్యక్రమం లో సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వనున్నారని తెలియజేశారు. ప్రజలు రెవెన్యూ అధికారులకు అందుబాటులో ఉండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూడేరు సర్పంచ్ శాంతమ్మ, సెక్రటరీ శేఖర్, మండల సర్వేయర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.