శ్రీశైలం: విద్యుత్ లేక అంధకారంలో నేషనల్ హైవే బస్టాండ్లు.అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం
కర్నూల్ నుంచి ఆత్మకూరు వరకు నిర్మించిన నేషనల్ హైవే 340సి రహదారిపై నేషనల్ హైవే అధికారులు ఏర్పాటు చేసిన బస్టాండ్ల వద్ద విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో తీవ్ర అంధకారం నెలకొంది. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి సమయాల్లో బస్టాండ్ల వద్ద చీకటి ఉండటంతో కొంతమంది మందుబాబులు అక్కడ కూర్చొని మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాహనదారులు, ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో మహిళలు, విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.