జగ్గయ్యపేట
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జగ్గయ్యపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.... స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట గ్రామానికి చెందిన చింతా వెంకయ్య మంగళవారం ఉదయం 11 గంటలకు గ్రామ సమీపంలోని బంకు నుంచి పెట్రోల్ తీసుకొని జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నాడు....వెనకనుంచి గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది ఢీకొంది ... దీంతో పెట్రోల్ డబ్బా నుండి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి కింద పడిపోయిన చింతా వెంకయ్యకు పెట్రోల్ అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు....స్థానికులు హుటా హుటీ న ఆసుపత్రికి తరలించారు...మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు