కాకినాడ రూరల్: కాకినాడ కార్పొరేషన్లో 6 పంచాయతీల విలీనం: హైకోర్టు కీలక తీర్పు
కాకినాడలోని 6 పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో విలీన ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల 6 పంచాయతీలు రద్దయి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో భాగం కానున్నాయి.