గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లిలో ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వ్యక్తిని శిక్షించాలి, సీపీఎం నాయకులు డిమాండ్
అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో ఐదవ తరగతి చదువుతున్న లక్ష్మీ అనే బాలిక ఇంటికి పెట్రోల్ పోసి నిప్పుపెట్టి బాలిక తీవ్రంగా గాయపడటానికి కారణమైన శ్రీనివాసులు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో బాధితులను సీపీఎం నాయకులు పారమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం మత్తులో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. అనంతరం సీఐ రామారావుకు వారు వినతి పత్రం అందజేశారు.