నర్సీపట్నం: మాకవరపాలెంలో రూ. 60 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ అయ్యన్న
మాకవరపాలెంలో 'పల్లె పండుగ 3.0'లో భాగంగా రూ. 60 లక్షలతో సీసీ రోడ్డు పనులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, నాణ్యమైన పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.