నారాయణపేట్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోటకొండ గ్రామంలో బంద్ విజయవంతం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బందులో భాగంగా నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఎం, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో శనివారం గ్రామంలోని ప్రవేటు, ప్రభుత్వ పాఠశాలలు, బ్యాంకులు మూసివేసి భగత్ సింగ్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి. రాము మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు.