అనంతపురం జిల్లా రేకులకుంట వద్ద ద్విచక్ర వాహనం ఎద్దును ఢీకొన్న ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Dec 3, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద ద్విచక్ర వాహనం ఎద్దును ఢీకొన్న ఘటనలో రేకులకుంట గ్రామానికి చెందిన నాగమణి అనే వివాహితకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.