రేపు ప్రజా ఉద్యమం ర్యాలీ విజయవంతం చేయాలని గుడిబండలో ఈర లక్కప్ప పిలుపు
గుడిబండ మండలంలో మంగళవారం ప్రజా ఉద్యమం పోస్టర్ను నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ ఈర లక్కప్ప ఆవిష్కరించారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనే కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 12వ తారీకు ప్రజా పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు డి ఎల్. యంజారే గౌడ్,జిల్లా కార్యదర్శి శివకుమార్ సర్పంచ్ కరుణాకర్ పాల్గొన్నారు.