పటాన్చెరు: గుమ్మడిదల లో నూతన బిజెపి పార్టీ కార్యాలయం ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో నూతన బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ... గుమ్మడిదల మండలం నుంచి బీజేపీ బలం పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఐలేష్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.