పుంగనూరు: చౌడేపల్లిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - బంధువుల ఆరోపణలు
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం కురపల్లిలో అలీ ఖాన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇది హత్యేనని బంధువులు ఆరోపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.