కడప నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్లో వివిధ ఫ్లాట్ ఫామ్ల వద్ద దెబ్బతిన్న పై కప్పులకు ఆర్టీసీ అధికారులు బుధవారం తాత్కాలికంగా మరమ్మత్తు పనులు చేపట్టారు. పై కప్పులు దెబ్బతిన్న కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వర్షాకాలం వస్తే బస్సుల కోసం ప్లాట్ ఫామ్ల వద్ద నిలబడాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు పనులు ప్రారంభించారు.