డోన్: వైసిపి కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా : బేతంచర్ల లో మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Oct 3, 2026 వైసీపీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి, వారికి అండగా నిలిచేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రవేశపెట్టారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు కార్యకర్త మరణిస్తే, వారి కుటుంబానికి ఈ బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. బేతంచెర్లలో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.