పటాన్చెరు: నియోజకవర్గంలో ఆకతాయిల ఆగడాలకు ట్రాఫిక్ పోలీసులు చెక్
సంగారెడ్డి జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణం కోసం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టారు. గత మూడు రోజుల్లో పటాన్ చెరు సబ్ డివిజన్ పరిధిలో ఇస్నాపూర్, అమీన్ పూర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు 154 మంది వాహనదారుల మాడిఫైడ్ సైలెన్సర్లను పట్టుకున్నారు. డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో పాశమైలారం ఏరియాలో రోడ్డు రోలర్‌తో ఆ సైలెన్సర్లు ధ్వంసం చేశారు.