కన్నుల పండుగగా జరిగిన జగ్గయ్య పేట తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ ఉత్సవం
జగ్గయ్య పేట తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి....అందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. ఈసందర్భంగా కళ్యాణ మహోత్సవ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు... స్వామి వారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలునిర్వహించారు....అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు....పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు