ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : అల్పపీడన ద్రోణి ప్రభావంతో గోనెగండ్లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది
గోనెగండ్లలో వర్ష బీభత్సం.అల్పపీడన ద్రోణి ప్రభావంతో గోనెగండ్లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉల్లి, పత్తి పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద రహదారులు కుంటలా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు జలమయమై ప్రమాదకరంగా మారాయి.