ఆర్మూర్ మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై వీడిసి ముసుగులో దాడిని ఖండిస్తూ శుక్రవారం గౌడ కులస్తుల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం నారాయణ గౌడ్ ను నిర్మల్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నారాయణ గౌడ్ మాట్లాడుతూ ఆపరేషన్ కళ్ళు నిషేధంలో భాగంగానే లిక్కర్ సిండికేట్ కార్పొరేట్ మీడియా గౌడ అభివృద్ధిని సహించకుండా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన విడిసి సభ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.