శ్రీశైలం: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం.33 రోజుల మల్లన్న హుండీ ఆదాయం 5 కోట్ల 28 లక్షల 37 వేల రూపాయల రాబడి
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ లెక్కింపును అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 33 రోజులలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం రూ.5 కోట్ల 28 లక్షల 37 వేల 281 నగదు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.హుండీ లెక్కింపులో నగదుతో పాటు 96 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 3 కేజీల 780 గ్రాముల వెండి కూడా లభించాయి. అదేవిధంగా విదేశీ కరెన్సీ రూపంలో యూఎస్ఏ డాలర్లు 321, కెనడా డాలర్లు 105, ఒమన్ బైసాలు 200 వచ్చాయన్నారు.